దిల్లీలో విమాన రాకపోకలకు అంతరాయం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీని దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో శనివారం 46 విమానాల సర్వీసుల దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఉత్తరాదికి వెళ్లే 17 రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయని రైల్వే వర్గాలు వెల్లడించాయి. వాతావరణ మార్పుల కారణంగా శుక్రవారం దాదాపు 300 విమానాల సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దీంతో అనేక మంది ప్రయాణికులు దిల్లీ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. వావావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం దిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా ఎనిమిది డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదవుతున్నాయి. దీంతో గాలి వేగం మందగించి కాలుష్య స్థాయిలు సైతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.