‘సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చూశారా?



హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా బన్ని అభిమానులకు ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ ఏడాది నెటిజన్ల నుంచి విశేష ఆదరణ పొందిన 'సామజవరగమన' పాట సాంగ్‌ ప్రోమోను విడుదల చేసింది. ఇప్పటికే లిరికల్‌ వీడియో ఆకట్టుకుంటుండగా, ఇప్పుడు సాంగ్‌ ప్రోమోతో నూతన సంవత్సరానికి సరికొత్త జోష్‌ తీసుకొచ్చింది.


బన్ని-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. టబు, జయరాం, నివేదా పేతురాజు, సుశాంత్‌, నవదీప్‌లు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. గీతాఆర్ట్స్‌, హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 



Loading video